ప్రియ నేస్తం!
నీ హృదయమనే కోవెలలో
నా రూపానికి స్థానమున్నదని
నీ స్నేహమనే బంధనంలో
నా హృదయం చిక్కుకున్నదని
నాగిని చేసే ఆనంద తాండవం లా
నీలిమేఘాలలో దోబూచులాడే చందమామలా
నా మనసు పరవశించి పోతోంది
నీ పుట్టిన రోజనే ఉత్సవానికి
నా మనసనే పావురం
నీ దరికి చేరుకుంది ఎపుడో
నా శుభాకాంక్షలు తెలపడానికి
అంతులేని ఈ ఆనంద క్షణాల్లో
దరి చేరలేదని విచారించకు
రివ్వున నీముందు వాలిపోవాలని
నా మది ఉవ్విళ్ళూరుతోంది. కాని
నీ చేరువకు రానందుకు
నా అపరాధం మన్నిస్తావని ఆశిస్తూ...
----కిషన్
ఈ కవిత నేను 27-04-1995 తేదీన నా చిన్ననాటి మిత్రుడి పుట్టినరోజు సందర్భంగా వ్రాసుకున్నా. మామూలుగా ఉత్తరం వ్రాద్దమనుకున్నా . అనుకోకుండా రెండు వరుసలకు న అనే అక్షరం వచ్చింది. బాగుందని ప్రతి వరుసను న అక్షరం తో మొదలెట్టి మొత్తం కవిత ను వ్రాశా. ఇది నేను వ్రాసుకున్న మొదటి కవిత. మీ సలహాలు, విమర్శలు ఆశిస్తూ..
కిషన్
No comments:
Post a Comment