Prema-Desam
Wednesday, December 22, 2010
అవినీతి ఏ రీతిగా ఖ్యాతి గడిస్తుందో చూస్తున్నారుగా. మన ప్రతినిధిగా ఎన్నుకున్న నాయకులు మన పాలిట వినాయకులుగా మారి నల్ల ధనం సంపాదన లో మునిగి తేలుతున్నారు. దీనికి బాధ్యత మనదే. ఎందుకంటే వారిని ఎన్నుకుంది మనమే కదా. మనం నిజాయితీగా మన వోటు ను వినియోగించుకుని అర్హులను ఎన్నుకుంటే ఈ అక్రమాలు జరగవని నా అభిప్రాయం. ఎవరికీ వారు నిజాయితీగా వుంటే చాలు. ఏమంటారు?
Saturday, December 4, 2010
Wednesday, November 24, 2010
Monday, November 22, 2010
ప్రియ నేస్తం!
నీ హృదయమనే కోవెలలో
నా రూపానికి స్థానమున్నదని
నీ స్నేహమనే బంధనంలో
నా హృదయం చిక్కుకున్నదని
నాగిని చేసే ఆనంద తాండవం లా
నీలిమేఘాలలో దోబూచులాడే చందమామలా
నా మనసు పరవశించి పోతోంది
నీ పుట్టిన రోజనే ఉత్సవానికి
నా మనసనే పావురం
నీ దరికి చేరుకుంది ఎపుడో
నా శుభాకాంక్షలు తెలపడానికి
అంతులేని ఈ ఆనంద క్షణాల్లో
దరి చేరలేదని విచారించకు
రివ్వున నీముందు వాలిపోవాలని
నా మది ఉవ్విళ్ళూరుతోంది. కాని
నీ చేరువకు రానందుకు
నా అపరాధం మన్నిస్తావని ఆశిస్తూ...
----కిషన్
ఈ కవిత నేను 27-04-1995 తేదీన నా చిన్ననాటి మిత్రుడి పుట్టినరోజు సందర్భంగా వ్రాసుకున్నా. మామూలుగా ఉత్తరం వ్రాద్దమనుకున్నా . అనుకోకుండా రెండు వరుసలకు న అనే అక్షరం వచ్చింది. బాగుందని ప్రతి వరుసను న అక్షరం తో మొదలెట్టి మొత్తం కవిత ను వ్రాశా. ఇది నేను వ్రాసుకున్న మొదటి కవిత. మీ సలహాలు, విమర్శలు ఆశిస్తూ..
కిషన్
Wednesday, November 3, 2010
Monday, November 1, 2010
మన్నించాలి. మీరన్నట్లు నేను శీర్షిక పేరును తెలుగు లో వ్రాసేందుకు ప్రయత్నించా. కాని వీలు కాలేదు. అంతర్జాల ప్రపంచం లోకి ఈమధ్యే అడుగెట్టా. అందుకే ఈ పొరపాటు. మీ అభిప్రాయం చదివి చాలా సంతోషించా. ఇకపై కూడా నా పొరపాట్లను నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నా . ఇంతవరకు నా మిత్రులు ఎవరూ వారి అభిప్రాయం పంపలేదు. కాని పెద్దవారు మీరు పంపినందుకే ఈ ఆనందం.ధన్యవాదములు.
Subscribe to:
Posts (Atom)